MLA Venigandla Ramu : మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

TRINETHRAM NEWS

తేదీ : 26/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ మత్తు పదార్థాలు సైలెంట్ కిల్లర్ ల పనిచేస్తూ సమాజాన్ని నాశనం చేస్తాయని, అన్నారు. సరదాగా మొదలయ్య డ్రగ్స్ వినియోగం వ్యసనంల మారుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మారకద్రవ్య వ్యతిరేకత దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు మరియు యువత కలిసి ఎమ్మెల్యే రాముతో పాల్గొన్నారు. అదేవిధంగా పురపాలక సంఘం కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మార్కెట్ సెంటర్, వాసవి చౌక్, ఏ జీకే పాఠశాల సెంటర్ మీదుగా కైకాల కళామందిర్ వద్దకు చేరుకుంది. ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న వాళ్లందరకు మత్తు పదార్థాలు వద్దు వద్దని, సామూహిక సంకల్పం ,సమాజ శ్రేయస్సు అంటూ నినాదాలు చేశారు. డ్రగ్స్ కు బానిసైన వాళ్లకు సమాజంతో పనిలేదని , ఉన్మాదుల మారి సమాజంపై ప్రభావం చూపుతారని ఎమ్మెల్యే అన్నారు. మారక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని ,మత్తు పదార్థాలకు సంబంధించి సమాచారం ఒక వే యి డెబ్బై రెండు కు కాల్ చేయాలని, తద్వారా ఒకరి జీవితాన్ని బాగు చేయడమే కాక, సమాజానికి మంచి చేసిన వాళ్ళము అవుతామని అనడం జరిగింది.

కూటమి ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిని, ఉక్కు పాదంతో అనిచివేస్తుందని తెలిపారు. దానివల్ల కుటుంబమే కాదు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. నేటి యువత ఎక్కువగా బానిసలు కావడం, ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గం లో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగంపై పోలీస్ యంత్రాంగం పాదం మోపేలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ నియంత్రణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సత్ఫలితాలను ఇస్తుందని , అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఇటువంటి రవాణా పెరిగిపోయిందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో డ్రగ్స్, గంజాయి రవాణాను నిరోధించామని రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి. వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజల్లో కూడా వీటిపై మరింత చైతన్యం రావాలని పిలుపునివ్వడం జరిగింది. నో డ్రగ్స్, నో ఎడిషన్ అనే నినాదం అందరిలో ఉండాలని కూటమి నాయకులు పేర్కొన్నారు. అందరూ కలిసి వాటికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో జి. బాలసుబ్రమణ్యం , మునిసిపల్ కమిషనర్ ఎస్. మనోహర్, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ. శ్రీకాంత్, సీనియర్ టిడిపి నాయకులు లింగం. ప్రసాద్, పి. సాంబయ్య, డాక్టర్. జి. సత్యనారాయణ, చేకూరు. జగన్మోహన్రావు, కడియాల. గణేష్, పట్టణ జనసేన అధ్యక్షులు మజ్జి. శ్రీనివాస్, విగ్నేశ్వర స్వామి వారి దేవస్థాన కమిటీ చైర్మన్ యస్. రాజేష్, కమిటీ తహసీల్దారు టీవీ. కిరణ్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ పి. శ్రీనివాస్, సీఏలు కొండపల్లి .శ్రీనివాసరావు, చిన్ని నాగ దుర్గ ప్రసాద్, ఎస్సైలు పలువురు పోలీస్ సిబ్బంది , పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు యువత , పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anti-Drug Day

You cannot copy content of this page

Scroll to Top