11 సీట్లకు పరిమితం చేశారు… ఎమ్మెల్యే, జోగేశ్వరరావు
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాలసీమ జిల్లా మండపేట, గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందించి ఉంటే ప్రజలు ఎందుకు 11 సీట్లకు పరిమితం చేస్తారని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని మంచి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ విషప్రచారం చేస్తుందని ప్రజలు ఈ విషప్రచారంపై అసహ్యించుకుంటున్నారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. మండపేట పట్టణంలోని 2,3 వార్డులలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అభివృద్ధిని మరిచారని వార్డులలో కనీస వసతులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకప్రక్క అభివృద్ది, ఒకప్రక్క సంక్షేమం చేస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి మరువలేనిదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


