Bandi Ramesh : టిపిసిసి ఉపాధ్యక్షులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ చేతుల మీదుగా దివ్యాంగురాలికి వీల్ చైర్ అందజేత

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 23 : కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శ్రీ వివేకానంద నగర్ మస్తాన్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. కాలనీకి చెందిన దివ్యాంగురాలికి అండగా నిలిచారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ చేతుల మీదుగా రోడ్డు నెంబర్ 10లో నివాసం ఉండే పి సన్యాసి రావు కూతురు కృష్ణవేణికి వీల్ చైర్ అందించారు. తన అభిమాన నాయకుడు బండి రమేష్ జన్మదినం సందర్భంగా ఆయన చేతుల మీదుగానే వీల్ చైర్ అందించినందుకు సంతోషంగా ఉందని మస్తాన్ రెడ్డి చెప్పారు.

దివ్యాంగురాలికి వీల్ చైర్ సాయం చేసిన మస్తాన్ రెడ్డిని ఈ సందర్భంగా బండి రమేష్ అభినందించారు. సేవా కార్యక్రమాలతోనే ప్రజల్లో గుర్తింపు వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, శివ చౌదరి, రమణ, జమీల్ భాయ్, సాజిద్, కాంగ్రెస్ డివిజన్ సీనియర్ నాయకుడు రవీందర్ ముదిరాజ్, ఆది నారాయణ, సతీష్ రెడ్డి, బొంత రవి, సత్య నారాయణ, పవన్ కుమార్, రమేష్ ఆచారీ, అనిల్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీ వాసులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

TPCC Vice President Kukatpally

You cannot copy content of this page

Scroll to Top