Sri Chaitanya Techno School : శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలుగు జాతి యొక్క శక్తి, శాంతి, సంప్రదాయాల కలయికగా వెలుగెరగే బోనాల పండుగను, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సప్తగిరి కాలనీలో ఎంతో భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఏజీఎం అరవింద్ రెడ్డి డీన్ వెంకటస్వామి మరియు ఇంచార్జులు అనిల్ శ్రావంతి తస్లీం స్వప్న ప్రణాళికాబద్ధంగా పాలుపంచుకున్నారు పరమాత్మ యొక్క శక్తికి నైవేద్యంగా సమర్పించిన బోనాలు
బోనాలు అనేవి కేవలం పండుగ కాది అది అమ్మవారికి మనం తెలుపుకునే కృతజ్ఞత, మన మనోభావాలను భగవత్కైంకర్యంగా అర్పించే ఆధ్యాత్మిక యాత్ర ఈ పండుగలో అమ్మవారిని గౌరవించే విధంగా విద్యార్థులు అమ్మవారు అలంకారాలతో, పోతురాజుగా, సంప్రదాయ దుస్తుల్లో ప్రదర్శనలతో పాఠశాల ఆవరణను కళాత్మకంగా మార్చేశారు సాంస్కృతిక వారసత్వానికి పునాది
ఈ ఉత్సవం ద్వారా విద్యార్థులలో భక్తి భావం పెంపొందడంతో పాటు, మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవ భావనను నింపే ప్రయత్నం జరిగింది చిన్నారి మనసుల్లో సంస్కార విత్తనాలు నాటే ప్రయత్నానికి ఇది అద్భుతమైన ఆరంభం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Chaitanya Techno School

You cannot copy content of this page

Scroll to Top