MLA Raj Thakur : మల్కాపూర్ గ్రామంలో బోనాల పండుగను ఘనంగా

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు

మల్కాపూర్ గ్రామం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మల్కాపూర్ అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని తల్లిని ప్రార్థించిన ఎమ్మెల్యే ఆలయంలో భక్తులతో కలిసి పాల్గొని సంప్రదాయ పద్ధతుల్లో పూజలు చేశారు. ఆయన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శక్తిగా నినాదాలు చేయడంతో భక్తుల మధ్య భక్తిరసం ఉప్పొంగింది ఈ పూజా కార్యక్రమం అనంతరం, గ్రామస్తుల నుండి వచ్చిన విజ్ఞాపనల నేపథ్యంలో, ఎమ్మెల్యే వెంటనే గ్రామ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మల్కాపూర్ నుండి గంగానగర్ కు వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఉన్న పాత కల్వర్టు పూర్తిగా శిథిలమైన స్థితిలో ఉండటంతో, ఆయన స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు పౌరుల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న ఈ కాల్వ మార్గాన్ని వెంటనే పునర్నిర్మించాల్సిన అవసరం ఉన్నదని గుర్తించిన ఆయన, సంబంధిత శాఖ అధికారులను వెంటనే అక్కడికి పిలిపించి స్థల పరిశీలన చేయించారు.

ప్రజల భద్రత, రవాణా సౌలభ్యం దృష్టిలో ఉంచుకుని, అత్యవసర చర్యలుగా నూతన కల్వర్టు నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలనే ఆదేశాలు ఇచ్చారు. అలాగే, పనులు వేగంగా పూర్తయ్యేలా రోజువారీ మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు ఇది తెలంగాణ ప్రభుత్వ సంకల్ప బలానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా తీసుకుంటున్న చర్యలకు అద్దం పడుతుంది. ప్రజల సమస్యల పట్ల ఎమ్మెల్యే అపారమైన నిబద్ధత, ప్రజల సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న విలువలను ఈ సందర్బంగా మనం మరల గుర్తు చేసుకోవచ్చు
“బోనాల పండుగ మాకు ఒక ఆధ్యాత్మిక ఉత్సవమే కాదు – ఇది మన ఐక్యత, మన గొప్ప సంస్కృతి, మన విలువలకు నిదర్శనం. ఈ సందర్భం ప్రజలకు శుభం కలగాలని, అన్నివిధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను,అని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు ఈ వేడుకలు ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే ప్రజానేతల స్వభావాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి. భవిష్యత్తులో కూడా ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని, ప్రజల సహకారంతో ప్రాంతాన్ని అభివృద్ధి మార్గంలో దూసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bonala festival celebrated in

You cannot copy content of this page

Scroll to Top