తేదీ : 18/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ గురునానక్ కాలనీలో ఎన్టీఆర్ భవన్ పార్లమెంట్ పార్లమెంటు కార్యాలయంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షులు చెరుకూరి. రాజే శ్వరరావు ల తో కలిసి ఎంపీ కేశినేని. శివనాద్ (చిన్ని) ను ఏఎంసి చైర్మన్ గా నియమితులైనటువంటి కె. సత్యనారాయణ ప్రసాద్ కలుసుకున్నారు. తనపై నమ్మకంతో యార్డ్ చైర్మన్ పర్సన్ గా అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ఎంపీకి తెలిపారు.
చైర్మన్ పర్సన్ గా ఎన్నికైనందుకు ఆయనకు ఎంపీ అభినందనలు తెలియజేశారు. జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నియమితులైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగ్రంచిప్రోలు మాజీ ఎంపీపీ వి. శ్రీనివాస రావు, టిడిపి నాయకులు రావూరి . విశ్వనాథం, ముత్తినేని. అశోక్, కిలారు . విశ్వనాధ్, పి. నాగరాజు, కనపర్తి. చిట్టిబాబు, పోతురాజులతోపాటు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


