Educate the Children : యానాదుల పిల్లలను చదివించండి. ముత్తు పదార్థాలకు దూరంగా ఉంచండి

TRINETHRAM NEWS

తేదీ : 18/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నం జిపిఆర్ ధర్మశాల ఆధ్వర్యంలో మచిలీపట్నం ఎస్టి కాలనీలో మూడు వందలు పేద కుటుంబాలకు చెందిన పురుషులకు, స్త్రీలకి చీరలు, లుంగీలను నిర్వహకులు గొరిపర్తి. శ్రీధర్ ,నూరి (ఖాన్) దివంగత బాజీ కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎల్. బాలాజీ, జనసేన పార్టీ నాయకులు ఎం. రాము, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్. అర్జున, కుంభం రవి, కిరణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా న్యాయవాది ఎల్. బాలాజీ మాట్లాడుతూ ఎస్టీ కాలనీలో పిల్లలందరూ చదువుకుని ఎదగాలని , చదువు లేకపోవడం వలన ప్రభుత్వపరంగా సంబంధిత అన్ని శాఖలలో ఎస్ టి పోస్టులు బ్యాక్ లాగ్ పోస్టులతో ఖాళీగా ఉన్నాయని అన్నారు. గంజాయి ముత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. మత్తు పదార్థాల వలన యువత పక్కదారి పడుతుందని , సమాజంలో నేరాల సంఖ్య తిరుగుతుందని, ఆయన అన్నారు. తల్లిదండ్రులు వాళ్ల చెడు వ్యసనాలకు స్వస్తి పలికి పిల్లలను మంచి మార్గంలో పెంచాలని తెలిపారు.

ఈ కాలనీ అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలన్నీ వాళ్లకి అందే విధంగా కృషి చేయాలని, శ్రీధర్ మిత్రబృందం క్రమం తప్పకుండా ఐదు సంవత్సరాలుగా యానాదులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అవనిగడ్డ ఫైర్ స్టేషన్ అధికారి సుధాకర్ సుధాకర్ ఇద్దరూ యానాది పిల్లలను దత్తత తీసుకుని మచిలీపట్నంలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివించడం గొప్ప విశేషం అన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఎం. రాము మాట్లాడుతూ చదువుకునే పిల్లలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఎంగిలి ఆకులు వద్దు, చూసే యానాదులలో క్రమంగా మార్పు వస్తుంది అని , ఈ మార్పు మరింత పెరగాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎస్టీలకు న్యాయం జరుగుతుందని అనడం జరిగింది.

వాళ్ల అభివృద్ధికి చదువు మార్గమని సూచించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అర్జున మాట్లాడుతూ ఉన్న నాలుగు ఎస్టీ కాలనీలను అభివృద్ధి పథంలోకి తీసుకురావాల్సిన అవసరం అందరిపై ఉందని అన్నారు. జి పి ఆర్ ధర్మశాల సేవలు అభినందనీయమన్నారు మానవసేవే మాధవసేవ అనే విధంగా ధర్మశాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్టి సంఘం నాయకులు కుంభం రవికిరణ్ యానాదులు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Educate the children of

You cannot copy content of this page

Scroll to Top