MLA Kolikapudi : స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 15/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, తోటమాల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలు నివాసము ఉంటూ శాశ్వత భూ హక్కులేని స్థలాలను ఎమ్మెల్యే కొలిక పూడి. శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం వాళ్ల నివాస స్థలాల ను క్రమ బద్దీకరణ చేయాలని, కోరుతూ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొత్తగా మంజూరు చేసిన జీవో నంబరు ముప్ఫై గురించి మండల తహసిల్దారు వివరించడం జరిగింది.

ఎవరైనా ఇలా శాశ్వత భూ హక్కు లేకుండా, సంక్రమిత భూమిగ పొందుతూ ,నూట యాభై గజాల స్థలం ఉంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా భూమికి ఎలాంటి డబ్బులు కట్టే పని లేకుండా, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా నూట యాభై నుంచి మూడు వందలు వరకు ఉంటే ప్రభుత్వ రేటు ప్రకారం మొత్తం భూమి విలువలో పదిహేను శాతంగా చెల్లించాలి. యాభై శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని వివరించడం జరిగింది. వీలైనంత త్వరగా ఈ స్థలాల క్రమబద్ధీకరణ కోసం కృషి చేస్తామని, వచ్చేనెల ఆగస్టు పదిహేను వ తేదీ నాటికి సంబంధిత అర్హులందరికీ పట్టాలు వచ్చేలా వస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA who inspected the

You cannot copy content of this page

Scroll to Top