రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ కలిసి అనేక కీలక విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రతి డివిజన్ స్థాయిలో చేపట్టవలసిన రోడ్ల మరమ్మతులు, వీధి లైట్స్ బిగింపు, డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణ, పారిశుధ్యం, పచ్చదనం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తగిన ఆదేశాలు జారీ చేయడమైంది ప్రతి డివిజన్‌లో అభివృద్ధి పనులకు ఆదేశాలు ఎమ్మెల్యే స్పష్టంగా పేర్కొన్నారు ప్రజలకు నిత్యావసర సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందనిఈ దిశగా రామగుండం మున్సిపల్ పరిధిలోని ప్రతి డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా
రహదారుల విస్తరణ మరియు మరమ్మతులు పలు కాలనీల్లో రహదారులు చాలా దుర్వస్థితిలో ఉన్నందున, కాంక్రీట్ రోడ్లు, బిటుమిన్ రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని సూచించారు వీధి లైట్లు మరియు ఎలక్ట్రికల్ మౌలిక వసతులు అన్ని డివిజన్లలో సౌరశక్తితో నడిచే వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, పాత లైట్లను తిరిగి బదిలీ చేయాలని ప్రతిపాదించారు డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణ వరదలు, వర్షపు నీటి నిల్వ నివారణకు అనుకూలంగా ఉండేలా మౌలికమైన డ్రైనేజీ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు పచ్చదనం మరియు పారిశుధ్యం ప్రతి డివిజన్లో పార్కులు, చెట్ల పెంపకం, వ్యర్థాల పారదర్శక నిర్వహణపై దృష్టి పెట్టాలని తెలిపారు
అధికారులపై సమీక్ష ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ కూడా మాట్లాడుతూ, ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. ప్రతిపాదించిన పనులపై టెండర్లు వేగంగా పిలవాలని, పనులు నాణ్యతతో పూర్తి అయ్యేలా పర్యవేక్షణ కూడా పెంచాలని సూచించారు రామగుండం అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని, 2026 నాటికి రామగుండాన్ని అభివృద్ధి పరంగా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వ లక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల నుంచి వచ్చే సూచనలకు, ఫిర్యాదులకు స్పందిస్తూ సమగ్ర ప్రణాళిక అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు రామగుండం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి పనులు ప్రజల సహకారంతో వేగంగా, పారదర్శకంగా పూర్తవుతాయన్న నమ్మకంతో ఎమ్మెల్యే ప్రెస్ మీట్ ముగించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


