జూన్ 27, 2026
TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా(అనంతగిరి) మండలం, జూలై 15 : జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు చిట్టం మురళి మంగళవారం నాడు పుట్టపాడు, పొర్లుబంధ గ్రామాలను సందర్శించారు. స్థానికులతో కలిసి గ్రామ సమస్యలు, అభివృద్ధి అంశాలను పరిశీలించారు. రోడ్లు, మంచినీటి సౌకర్యాలపై తమ కష్టాలను వినిపించిన గ్రామస్తులు, వాటిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వెంటనే స్పందించిన మురళి, సమస్యలను పార్టీ అధినేతకు నివేదించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chittam Murali's tour – meeting

You cannot copy content of this page