అల్లూరిజిల్లా(అనంతగిరి) త్రినేత్రం న్యూస్ జులై 16 : గత ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ హయాంలోనే సాధ్యమవుతుందని జనసేన నేత చిట్టం మురళి అన్నారు. మారుమూల గ్రామాలకు రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
బొడ్డపాడు, పుట్టపాడు, పొర్లు బంధ గ్రామాల్లో “బాబు స్యూరిటీ – భవిష్యత్‌కి పవన్ కళ్యాణ్ గ్యారెంటీ” పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పారు. జనసైనికులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


