Divyangs should Apply : దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. దివ్యాంగులు ఆర్థిక స్వాలంబన ద్వారా సాధారణ జీవనం సాగించేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమ, సేవ, వ్యాపారం స్థాపించుకుని జీవనోపాది పొందాలనే లక్ష్యంతో దివ్యాంగులకు ప్రభుత్వం ఉపాది, పునరావాస పదకం అమలు చేస్తుందని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తెలిపారు.
ఈ పధకం కింద బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా రూ.50 వేలతో 22 యూనిట్లు, బ్యాంకు లింకేజీతో రూ.లక్ష (1), రూ.2 లక్ష లు (1), రూ.3 లక్షలతో (1) యూనిట్లు మంజూరు చేయడం జరిగుతుందని పేర్కొన్నారు. 2025-25. ఆర్ధిక సంవత్సరంలో లబ్దిదారుల ఎంపిక ఆన్లైన్లో జరుగుతుందని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు www.tgobmm s.cgg.gov.in వెబ్సైట్లో ఈనెల 14 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని . అభ్యర్ధులకు వైకల్యం కనీసం 40 శాతం పైబడి ఉండాలి. 21 నుంచి 55 ఏళ్ల లోపువారు అర్హులు, అభ్యర్థుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు ఉండాలని తెలిపారు. 5 ఏళ్లలలో ఈ పథకం కింద లబ్ది పొందకుండా ఉండాలని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Divyangs should apply

You cannot copy content of this page

Scroll to Top