వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : – మంత్రి కొండ సురేఖ కుల్కచర్ల మండలం పరిధిలోని బండవెల్కి చర్ల గ్రామం శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి వారిని గౌరవ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా.సురేఖ, పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గుడి ఆవరణలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.అనంతరం ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.80 కోట్లతో కూడిన సమగ్ర ప్రణాళికను మంత్రివర్యులకు సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కొరకు సమర్పించిన ప్రణాళికను 100% శాతం దశలవారీగా అమలు చేస్తూ ఆలయాల పునర్నిర్మాణం,అభివృద్ధి పనులను అత్యున్నత ప్రమాణాలతో పూర్తిచేస్తాం అని తెలిపారు.పరిగి నియోజకవర్గ పరిధిలో అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ పాంబండ రామలింగేశ్వర దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని మంత్రి శ్రీమతి కొండా.సురేఖ పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


