తేదీ : 11/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను జనసేన పార్టీ నాయకులు పరిశీలించడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. కానీ ప్రభుత్వం మారి ఏడాది దాటిన తర్వాత కూడా మిడ్ మిల్స్ , నాడు నేడు బోర్డులు , గత ప్రభుత్వం యొక్క క్యాలెండర్లు దర్శనమిచ్చాయి.
కొంతమంది విద్యార్థుల యూనిఫామ్ లు లేని విషయం గమనించారు. సదరు విషయాన్ని విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లామని మండల జనసేన పార్టీ అధ్యక్షులు షేక్. యాసిన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, నందమూరి. వెంకటేశ్వరరావు, తోట. కృష్ణ కిషోర్, చింతల .నాగ వెంకటేష్ పండు, పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


