తేదీ : 11/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భీమడోలు మండలం , కోరు కొట్ల గ్రామంలో నిర్వహించినటువంటి పల్లె పల్లెకు పత్సమట్ల కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని , వాళ్ల నుండి నేరుగా వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది. గ్రామ సమీపంలో రహదారిపై రైతులు పంట బోదీపూడిక తియ్యాలని ఆయనను కోరగా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశమై గ్రామంలో ఉన్న సమస్యలను , వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూ, సూపర్ సిక్స్ పథకాలలో ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ , అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తున్నామని తెలిపారు.
వైసిపి నేతలు రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇంత అద్భుతంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలకు కండ్లు కనిపించడం లేదా అని వాళ్లను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ముఖ్య నేతలు జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, వీర, తెలుగు మహిళలు , ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


