Fry Day – Dry Day : వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా

TRINETHRAM NEWS

డివిజన్ లలో ఫ్రై డే – డ్రై డే కార్యక్రమం నిర్వహించారు.

రామగుండం డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వివిధ చోట్ల పర్యటించి పూల కుండీలలో , కూలర్ లలో , పాత టైర్లలో , డ్రమ్ములలో చాలా కాలంగా నిలువ ఉన్న నీటిని పార బోయించడంతో పాటు దోమలు పెరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి వివరించారు. దోమల నిర్మూలన కొరకు ఫాగింగ్ , ఆయిల్ బాల్స్ వేయడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ప్రశాంత్ నగర్ ప్రజా మరుగు దొడ్డిలో సౌకర్యాలను పరిశీలించారు . ఆవరణ శుభ్రం చేయించారు.

సిబ్బందిచే పి కె రామయ్య కాలనీ , ఖాజీపల్లి, అల్లూరు తదితర ప్రాంతాల్లో రోడ్ల వెంబడి పెరిగిన పిచ్చి చెట్లు , పొదలు తొలగించారు . ఫైవ్ ఇంక్ లైన్ ఏరియా వ్యాపారస్థులకు ట్రేడ్ లైసెన్స్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో నగర పాలక సంస్థ సానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం , కిరణ్ , కుమార స్వామి , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ ,వార్డు అధికారులు , సానిటరీ జవాన్లు , మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

As part of the 100-day

You cannot copy content of this page

Scroll to Top