Unidentified Body : గెడ్డ వాగులో గుర్తు తెలియని మృతదేహం కలకలం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా శోభకోట (హుకుంపేట), త్రినేత్రం న్యూస్ జూలై 9: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని శోభకోట పంచాయితీ సుండ్రుపుట్టు పరిధిలోని గెడ్డ వాగు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమై కలకలం రేపింది. స్థానికులు వాగు వద్ద మృతదేహాన్ని గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న హుకుంపేట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పూర్తి వివరాలు సేకరించారు. మృతదేహం గుర్తు తెలియని వ్యక్తిగా భావించి శోభకోట రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మృతుడి వివరాలను ఎవైనా గుర్తిస్తే హుకుంపేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సూర్యనారాయణను 9440904228 నంబర్లో సంప్రదించాల్సిందిగా పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Unidentified body found in

You cannot copy content of this page

Scroll to Top