డిండి (గుండ్లపల్లి) జులై 06 త్రినేత్రం న్యూస్. రైతుల పొలాలకు సంభందించి దారి విడిచేందుకు ప్రభుత్వ స్థలాన్ని పక్క పొలం రైతులు విడవకపోవడంతో డిండి మండలంలోని జాల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త తండాకు చెందిన సంభంధిత పొలాల రైతులు తహసీల్దార్ కార్యాలయంలో పిర్యాదు చేయడంతో విచారణ నిర్వహించిన అనంతరం శనివారం తహసీల్దార్ ఆంజనేయులు రైతుల పొలాలకు ఇబ్బంది కలగకుండా బాటను విడవాల్సిందే నని,ఈ సందర్బంగా బాటకు అడ్డంగా పెట్టిన రాళ్లను తొలగించి, రైతులకు బాటను పునరుద్దరించారు.ప్రభుత్వ భూములను ఎవరు స్వాధీనపర్చుకున్ననూ చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు.గతంలో పొలాలకు ఉన్న బాటలు ఎవరుకూడా ఆక్రమించిననూ,బాటలను మూసివేసిననూ ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ. వెంకట్,ఎస్సై రాజు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


