దేవరకొండ జులై 06 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, మహాత్మా గాంధీ విగ్రహాన్నిఎం ఎల్ ఏ బాలునాయక్ఆవిష్కరించి, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి. ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో గాంధీజీ అగ్రగణ్యుడు అని అన్నారు. మహాత్మా గాంధీ భారత సమాజానికి ఒక వరం అని అన్నారు. గాంధీజీ ఆదర్శాలు మరియు విలువలు మొత్తం ప్రపంచానికి కొత్త దిశానిర్దేశం చేశాయి అని ప్రపంచ యుద్ధాల కాలంలో ప్రపంచం అనేక రకాల ద్వేషం మరియు వైషమ్యాలతో బాధపడుతున్న సమయంలో ఆయన అహింస మార్గాన్ని చూపించారు అని అన్నారు.
సత్యం మరియు అహింసతో గాంధీజీ చేసిన ప్రయోగం ఆయనకు గొప్ప మానవ హోదాను ఇచ్చిందని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు,PACs చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు,NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


