జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ ఏరియా పశు వైద్యశాలలో జునోసిస్ డే ను డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు కార్యక్రమంలో మాట్లాడుతూ నేడు ప్రతి ఇంట్లో కుక్క జంతువే కాకుండా ఇంట్లో మనిషిలా అయిపోయింది అందుకని మనము మన ఇంట్లో పెంచుకునే కుక్కలను క్రమం తప్పకుండా డాక్టర్ సలహాలు తీసుకుంటూ వాటికి కావలసిన వ్యాక్సిన్లు వేసుకోవాలి ఈ జునోసిస్ డే సందర్భంగా ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన ఏరియా వెటర్నరీ హాస్పిటల్ ఏడి డాక్టర్ పూర్ణచంద్ర ను అభినందించారు ఈరోజు మొత్తం 36 కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చారు ఇందులో పోలీసు కుక్కలు కూడా ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఏరియా వెటర్నరీ హాస్పిటల్ ఏడి శ్రీ పూర్ణచంద్రరావు , డాక్టర్ పరమేష్ సిబ్బంది హాజీ, అశోక్, మహేష్ జగన్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

World Zoonosis Day celebrated

You cannot copy content of this page