మండపేట సబ్ స్టేషన్ నుండి సరఫరా…
మండపేట ; త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మండపేట టౌన్ సబ్ స్టేషన్ నుండి అర్తమూరు గ్రామానికి సంబందించిన 24 గంటల నిరంతరం 3 ఫేస్ విద్యుత్ సరఫరా ను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. అర్ డి ఎస్ ఎస్ పథకం ద్వారా అంచనా రూ 50 లక్షలు గల విలువైన విద్యుత్ పరికరాలు అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమం లో మాజీ గ్రoధాలయం చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి విద్యుత్ శాఖ మండపేట సబ్ డివిజన్ అధికారి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి హెచ్ శ్రీధర్ విద్యుత్ శాఖ మండపేట అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏం మూని విద్యుత్ శాఖ ద్వారపూడి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి రవి కుమార్ జూనియర్ ఇంజనీర్స్ సత్యనారాయణ,సురేష్ , విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


