Harish Rao : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుని కలిసిన పటాన్‌చెరు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు

TRINETHRAM NEWS

Trinethram News : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారింది.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మమ్మల్ని మోసం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసి.. తమ సమస్యలను బీఆర్‌ఎస్ ముందుండి పరిష్కరించాలని విజ్ఞప్తి చేసిన ఆటో డ్రైవర్లు

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే.. ఎన్నికల ముందు ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు.. కానీ ఇప్పుడు ఆటో కార్మికుల గురించి ఒక్క మాటా మాట్లాడడం లేదు.

ఆటోలు నడవక, బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు.. ఆటో కార్మికులు కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది

చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలి. రెండేళ్లుగా ఒక్కో కార్మికుడికి బాకీ పడ్డ రూ.24 వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం – హరీష్ రావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Representatives of Patancheru Auto

You cannot copy content of this page

Scroll to Top