YS Jagan : జగన్ పై కేసు విషయంలో ఏపీ పోలీసులకు , ప్రభుత్వానికి హైకోర్టులో షాక్

TRINETHRAM NEWS

Trinethram News : రెంటపాళ్ల పర్యటన కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ! కారు ప్రమాదం జరిగితే.. కారులో ఉన్నవాళ్లపై కేసు ఎలా పెడతారు? అంటూ పోలీసులను నిలదీసిన హైకోర్టు

కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా ? అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా.. తదుపరి విచారణను మంగళవారానికి(జులై 1వ తేదీకి) వాయిదా వేసింది. అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shock to AP Police

You cannot copy content of this page

Scroll to Top