MLA Adireddy Srinivas : గోదావరి పుష్కరాలను విజయవంతం చేస్తాం

TRINETHRAM NEWS

ఛాంబర్ రౌండ్ టేబుల్ సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

పలు సూచనలు చేసిన అఖిలపక్ష నాయకులు, హాజరైన ప్రభుత్వ అధికారులు
రాజమహేంద్రవరం : వచ్చే 2027 గోదావరి పుష్కరాలలో చిరు వ్యాపారాలకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. 2027 గోదావరి పుష్కరాలు నగర సమగ్ర అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వా రాజా ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యం బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసు మాట్లాడుతూ, చిరు వ్యాపారుల కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా సామూహిక వ్యాపారం చేసుకోవాలని కోరుతామన్నారు. చారిత్రాత్మక, సాంస్కృతిక, సంప్రదాయాలు కలిగిన నగరంలో గోదావరిలో ఎక్కడ స్నానం చేసిన పుణ్యమేనని దీన్నీ భక్తులకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. నగరంలో 25 ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశామని, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తానన్నారు. పాత నగరాన్ని వదిలేస్తామన్నారు. ప్లాస్టిక్ నిర్ములనకు కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా సహకరించాలని , డీ షిల్టేషన్ చేయిస్తున్నామన్నారు.

నవంబర్ లో 50 ఎం ఎల్ డి వాటర్ ప్లాంట్ ప్రారంభమ వుతుందన్నారు. వచ్చే పుష్కరాల్లో భక్తుల రద్దీ నీ తగ్గించడానికి పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు భోజనాలు, మరుగు దొడ్లు మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రవాణాకు సంబంధించి బస్సు, ట్రైన్స్ వివరాలు, ఏ ఘాట్లో ఎంత మంది భక్తులు ఉన్నారు, ఏ ఘాట్లు ఖాళీగా ఉన్నాయని తదితర వివరాలు, ట్రాఫిక్ పూర్తి స్థాయిలో కంట్రోల్… డ్రోన్స్ సమీకృత సమాచార వ్యవస్థ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమృత్ 2.o లో వచ్చిన రూ. 200 కోట్లలోని 90 కొట్లతో మరుగు దొడ్ల కోసం ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్ లు జరిగేలా స్టేడియం నిర్మాణం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కు కృషి చేస్తున్నామని, గోదావరి పుష్కరాలకు స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకుంటామనీ, కలిసి కట్టుగా పుష్కరాలను విజయవంతం చేద్దామన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు చిన్న వ్యాపారులను దెబ్బతీయవద్దనీ, డీసిల్టేషన్ ముందుగానే చేయాలన్నారు.

పాత నగరం ఆనవాళ్లను పాడు చేయవద్దనీ, నగరంలోని మూడు మేజర్ పాత డ్రైనేజీలను ఎస్ టీ పి ప్లాంట్ కు అనుసందించాలన్నారు. వైసిపి నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ గత పుష్కరాల్లో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా 2027 పుష్కరాలకు భక్తుల క్రమబద్ధీకరించి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పుష్కరాలు జరగాలనీ, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బిజెపి నాయకుడు కంటిపూడి సర్వారాయుడు మాట్లాడుతూ పవిత్ర గోదావరి పుష్కరాలకు స్నానాలకు భక్తులకు అన్ని రేవులకు మార్గాలను సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బిజెపి నాయకుడు కురగంటి సతీష్ మాట్లాడుతూ నగరంతో పరిపాలన అవగాహన కలిగిన అధికారులను బదిలీ చేయకుండా పుష్కరాలు వరకు వారిని సేవలు వినియోగించుకున్న బదిలీ చేయకూడదన్నారు. తెలుగు రాని పోలీసులను పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేయవద్దని, గోదావరి గట్టు వెంబడి మద్యం షాపులను తొలగించాలన్నారు.
ఆర్డీవో కృష్ణ నాయక్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను అన్ని వర్గాల ప్రజలతో, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో సమన్వయం చేసుకుంటామని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో దశల వారీగా మౌలిక వసతుల ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.శానిటేషన్ పరంగా ఇబ్బందులు లేకుండా శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టామన్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామనీ, నగరంలో ముఖ్యమైన ఘాట్లలో ఇన్ అండ్ ఔట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
2003, 2015 పుష్కరాలను సమీక్ష చేసుకుని 20 27 పుష్కరాలను చేపడతామన్నారు. జిల్లా ఏ ఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీ నియంత్రణకు స్వచ్ఛంద సేవకులుగా మాజీ సైనికులు, పోలీసులను వినియోగిస్తే బాగుంటుందన్నారు .ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఇ తిలక్ మాట్లాడుతూ అన్ని ప్రధాన ఘాట్లలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఉంటాయని ఉంటాయన్నారు. రుడా మాజీ చైర్పర్సన్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ, మల్టీ లెవెల్ వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లను చేపట్టాలని చిన్న వ్యాపారుల జోలికి వెళ్ళవద్దన్నారు. పుష్కరాలకు వచ్చే వాహనాలను నగరానికి బయటే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలనీ కోరారు. ఛాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా మాట్లాడుతూ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులను నష్టం కలగకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. గుండు వారి వీధి, వంకాయల వారి వీధుల్లో విద్యుత్ ప్రమాదకరంగా ఉన్నాయని, భూగర్భ విద్యుత్తు కేబుల్స్ వెయ్యాలని కోరారు.
మెయిన్ రోడ్డుకు అనుసంధానంగా వున్న రోడ్లు అభివృద్ధి చేయాలన్నారు. సిపిఐ జిల్లా నాయకుడు టి మధు మాట్లాడుతూ నగరంలో ముఖ్యంగా పుష్కరాలు సమయంలో శానిటేషన్ మీద దృష్టి పెట్టాలన్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులను క్రమ బద్దీకరించడానికి గోదావరి రైల్వే స్టేషన్ లో రైళ్లు ఆపాలని, శివారు ప్రాంతంలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ కొత్తగా నిర్మించాడానికి ఆలోచన చేయాలన్నారు. రాజమండ్రి చరిత్ర తెలిసేలా కళా, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. సీనియర్ పాత్రికేయుడు వి.వి కృష్ణ కుమార్ మాట్లాడుతూ అందరి ప్రజలు, అన్ని సంస్థలతో సమన్వయం చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేయాలన్నారు. దేశంలో కాశి తరువాత రాజమండ్రి పవిత్ర పుణ్యక్షేత్రమని, ముందుగా గోదావరి నది పరిశుభ్రంగా ప్రక్షాళన కావాలన్నారు. పుష్కరాల రేవులో స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందన్న ప్రచారం వద్దన్నారు.

రోడ్లు వెడల్పు చేయాల్సిన పనిలేకుండా రోడ్ల పై వాహనాలు పెట్టకుండా నియంత్రణ చేస్తే ట్రాఫిక్ సమస్య ఉండదనీ ఆ దిశగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకుడు అసదుల్లా అహ్మద్ మాట్లాడుతూ, గోదావరి నదిని చూడడం కాదనీ , నది తీరం సౌందర్యాన్ని అస్వదించేలా పుష్కరాలు ఏర్పాట్లూ చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గేలా చూడాలనీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలన్నారు. సిపిఎం జిల్లా నాయకులు టి అరుణ్ మాట్లాడుతూ, చిన్న వ్యాపారులను ఇబ్బంది పెట్ట వద్దన్నారు. గోదావరి నది కాలుష్యాన్ని తొలగించాలని, అవసరమైన చోట్ల పైపు లైన్లు మార్చాలనీ నగర ప్రజానీకానికి పరిశుభ్రమైన మంచి నీరు అందించాలన్నారు. నందెపు శ్రీనివాస్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా అన్ని చోట్ల భారీ ఎత్తున మొక్కలు నాటాలనీ నగరంలో పచ్చదనాన్ని, సుందరీకరణ న్ని చూడగలుగుతామన్నారు. ఈ సమావేశంలో వై శ్రీను, జామి సత్యనారాయణ, కాశి నవీన్ కుమార్, నల్లం శ్రీను, వర్రే శ్రీనివాస్, కోళ్ల బాబు, టికే విశ్వేశ్వర రెడ్డి, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, అశోక్ కుమార్ జైన్, పొలసానపల్లి హనుమంతరావు, కొల్లేపల్లి శేషయ్య, ఆకుల శ్రీనివాస్, క్షత్రియ బాలసుబ్రమణ్యం తదితరులు మాట్లాడారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will make the Godavari

You cannot copy content of this page

Scroll to Top