ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం MLA TRR

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ‘పరిగి పట్టణంలోని ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిగి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 269 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లను స్థానిక నాయకులు,అధికారులతో కలిసి పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అందజేశారు.ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను తీసుకున్న లబ్ధిదారులు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే TRR ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఉన్న నిరుపేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదల అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో 7లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసింది,రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ చిత్తశుద్ధితో అభివృద్ధి,సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని,పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే TRR అన్నారు. ఇళ్లు రానివారు బాధపడొద్దు, విడతలవారీగా అర్హులందరికీ ఇస్తాం అని,ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదోడు సన్నబువ్వ తినాలనే సంకల్పంతో రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం అందిస్తున్నాం,గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి అతి తక్కువ ధరకే స్టీలు,సిమెంటు అందించే విధంగా కంపెనీలతో మాట్లాడుతున్నామని ఎమ్మెల్యే TRR తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The aim of the Congress

You cannot copy content of this page

Scroll to Top