జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ధవలేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద జరుగుతున్న పంప్ హౌస్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, ధవలేశ్వరం : వర్షాలు మొదలవుతున్నాయని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ధవలేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద 3 కోట్ల 80 లక్షల రూపాయలతో మురుగునీరు సంపు మరియు పంప్ హౌస్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గోరంట్ల పరిశీలించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో బేస్మెంట్ పనులు పూర్తి చేయాలని, వర్షాలు మొదలవుతున్నాయని, వర్షాలు ఎక్కువగా వస్తే పనులకు ఆటంకం కలుగుతుందని, అలాగే కొంతమేర నీరు నిలిచిపోయే అవకాశం ఉందని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The rains are starting

You cannot copy content of this page