Free Bus Passes : ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పెంచిన బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలి, వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ బస్టాప్ లో నిరసన తెలియచేయడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజుకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో బస్ పాస్ ఛార్జీలు 20 శాతం పెంచడం సరికాదు గతంలో 1150 rs. ఉంటే ఇప్పుడు 1400 వందలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా లో మారు మూల ప్రాంతాలనుండి చదువుకోడానికి పేద విద్యార్థులు మండలాలకు అలాగే జిల్లా కేంద్రానికి వస్తుంటారు.

ఇప్పటికే విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలు కట్టలేక తల్లితండ్రుల పై ఒత్తిడి తెస్తుంది,బస్సు చార్జీలు తగించాల్సింది పోయి ప్రభుత్వం RTC బస్ పాస్ చార్జీలను 20% పెంచడం సరికాదు అలాగే విద్యార్థుల పై ఒత్తిడి తీసుకురావడమే కాక విద్యార్థుల తల్లిదండ్రులు చెమట చిందించి పూట గడవక ఇబ్బంది పడుతూ విద్యార్థుల భవిష్యత్తు చదువు ఆ విద్య అందుకోవడానికి విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రులు చెమటోడ్చి పనిచేస్తూ విద్యార్థులను చదువుల కోసం మండలాలలకి జిల్లా కేంద్రంలోనీ కళాశాలకు పంపడం జరుగుతుంది ఇట్లాంటి పరిస్థితులలో ఛార్జీల పెంపు నిర్ణయం సరికాదు . రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బస్ పాస్ చార్జీలను తగ్గించాలని, విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు అందించాలని అదే విధంగా ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించి వాటిని సమయానికి అనుకూలంగా నడిపించాలని SFI వికారాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది లేని యడల పెద్ద ఎత్తున్న జిల్లాలో బస్లు నడవకుండా ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తేజ జిల్లా నాయకులు రెహాన్ సిద్దు,అభిషేక్,ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Government should give free

You cannot copy content of this page

Scroll to Top