MLA Songa Roshan Kumar : శాశ్వత రోడ్లు పునరుద్ధరణ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 13/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం , మండలం , యర్ర గుంటపల్లి గ్రామంలో శాశ్వత రోడ్లు పునరుద్ధరణ శంకుస్థాపన డైనమిక్ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేశారు. ఏలూరు నుండి జీలుగుమిల్లి వరకు రోడ్లు దారుణంగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఏమి పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
కూటమి ప్రభుత్వం గెలిసిన తర్వాత రాష్ట్రంలో అన్ని రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది, కొత్త రోడ్లు కూడా వేశారు. య ర్రగుంటపల్లి గ్రామం నుండి చింతలపూడి నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల రోడ్లు మరియు, బీసీ రోడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టిడిపిమాజీ జెడ్పిటిసి తాళ్లూరి. రాధా రాణి, కార్యకర్తలు ఆలవాల. సుంకర్ రెడ్డి, నాగు, ఎంపీటీసీ- రెండు భాస్కర్, వి. వెంకట్ రెడ్డి, ఐ.వి సత్యనారాయణ, యోబో కూటమి నాయకులు సంబంధి అధికారులు పాల్గొన్నారు.

అదేవిధంగా చింతలపూడిలో నూతనంగా ఆధునికరించిన నగర పంచాయతీ కమిషనర్ కార్యాలయం ను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. చింతలపూడి పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు, సంబంధిత సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA laid the foundation

You cannot copy content of this page

Scroll to Top