త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మండపేట పురపాలక సంఘ పరిధిలో రోడ్లు, డ్రైన్లు నిర్మాణం నకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, గురువారం శంఖుస్ధాపన చేశారు. మండపేట పట్టణంలో 15 నుండి 22 వార్డులలో BPS నిధులు 1 కోటి 54 లక్షలతో రోడ్డు మరియు డ్రైన్లు నిర్మించుటకు ఎమ్మెల్యే వేగుళ్ళ చేతులమీదిగా కొబ్బరికాయ కొట్టి శంఖుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, ఆయా వార్డు కౌన్సిలర్లు యరమాటి గంగరాజు, కాశిన కాశీవిశ్వనాధం, చిట్టూరి సతీష్, కాళ్ళకూరి స్వరాజ్యభవాని, బొక్కా సరస్వతి, మలసాని సీతామహాలక్ష్మి, కొవ్వాడ బేబి, టీడీపీ నాయకులు సిరంగి ఈశ్వరరావు, పెందుర్తి ప్రధీప్, కాళ్లకూరి శ్రీనివాస్, బడుగు రత్నం రాజు, కొవ్వాడ అప్పనబాబు, గనిశెట్టి బాబి, సిద్దిరెడ్డి రామకృష్ణ, అధికారులు మున్సిపల్ కమీషనర్ టి.వి.రంగారావు, మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె.శ్రీనివాస్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరు డి.వి.పవన్ కుమార్, వార్డు ఏమినిటీస్ సెక్రటరీలు మరియు మున్సిపల్ సిబ్బంది, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


