జూన్ 27, 2026
TRINETHRAM NEWS

డిండి ( గుండ్ల పల్లి ) జూన్ 12,త్రినేత్రం న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో భాగంగా నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్ లోని డిండి మండలంలో గురువారం రెవిన్యూ సదస్సులు కొనసాగాయి. డిండి మండల కేంద్రం తో సహా కామేపల్లి గ్రామంలో గురువారము రెవిన్యూ సదస్సులు నిర్వహించబడ్డాయి .డిండి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించబడిన రెవెన్యూ సదస్సులో డిండి గ్రామానికి సంబంధించిన రైతులు గతంలో ఇరిగేషన్ శాఖ పేరున నమోదు అయిన రైతుల భూములను ,హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము తిరిగి రైతుల పేరున బదలాయించాలని డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సరోజ కు దరఖాస్తు తో పాటు హైకోర్టు ఉత్తర్వులను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో రైతులు ఆలంపల్లి లక్ష్మీనారాయణ, గుర్రం రాములు, లక్ష్మీనరసింహ, వంగాల రఘుమారెడ్డి, శేఖర్ రెడ్డి, వావిళ్ల సలయ్య, పొలం లక్ష్మణ్ ,నల్లగంతుల రవి, వెంకటయ్య, తుమ్మల కృష్ణారెడ్డి, గుర్రం సురేష్, శ్రీనివాస్ రెడ్డి ,తదితర రైతులతో పాటు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Revenue conference held at

You cannot copy content of this page