CPI : అగ్రిగోల్డ్ బాధితులకు చివరి రూపాయి వచ్చే పోరాటం ఆగదు

TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వి తిరపతిరావు పిలుపు

అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి భాదితులు కు చెల్లించాలి

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ, జూన్ 08: అగ్రిగోల్డ్ బాధితులకు చివరి పరిహారం అందేవరకు పోరాటం కొనసాగిస్తామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి రావు ప్రకటించారు .. ఆదివారం ఉదయం స్థానిక గాంధీభవన్ లో అసియోషన్ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా జనరల్ బాడీ సమావేశం కె శ్రీనువాస్ రావు అధ్యక్షతన జరిగింది

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని, చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాట తప్పరాని, ఇప్పటికైనా ఆలస్యం ఏమి లేదని, వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు రావాల్సిన మొత్తం డబ్బును వారి ఖాతాలోకి జమ చేయునట్లు, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని అన్నారు. అగ్రిగోల్డ్ సమస్య ఏర్పడి 11 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని ఆయన అన్నారు ఎన్నికల ముందు కూటమి నాయకులు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటివరకు పరిహారం అందిందంటే అది సంస్థ చేసిన పోరాట ఫలితంగా జరిగిందని ఆయన అన్నారు అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత చూపుతే మరొక సారి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు

ఇంకా ఈ సమావేశంలో సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సామాజిక హక్కుల వేదిక నాయకులు సగర సంఘం జిల్లా అధ్యక్షులు నక్క కిషోర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొమ్మేటి రాంబాబు, గౌరవాధ్యక్షులు వై కె రాజు, ఆర్గనైజింగ్ జిల్లా కార్యదర్శి కర్రి చంద్రశేఖర్ నాయకులు కె భోగరాజు, పి ఏసురాజు వెంకన్న అర్జునరావు జిలానీ వరలక్ష్మి తదితరులు ప్రసంగించారు జిల్లా వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The fight for the last

You cannot copy content of this page

Scroll to Top