త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు) అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, రావణాపల్లి గ్రామంలో ఈనెల 12వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ (సి పి ఐ) మండలం మహాసభ నిర్వహిస్తున్నట్టు సిపిఐ మండల కార్యదర్శి ఇరువాడ దేవుడు ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా అల్లూరి జిల్లా కార్యదర్శి, పి. సత్యనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, జీ.వి. సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ, అనకాపల్లి కార్యదర్శి, మాకిరెడ్డి రామ్ నాయుడు హాజరవుతున్నారు. కావున ఈ మహా సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం, అందరూ ఈ మహాసభను జయప్రదం చేయాలని, ఇరువాడ దేవుడు కోరడమైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


