Manda Krishna Madiga : ‘పద్మశ్రీ’ ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా

TRINETHRAM NEWS

Trinethram News : న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని.. ఈ అవార్డు ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పద్మశ్రీ పురస్కారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు, ఉద్యమానికి దక్కిన గౌరవమని, జాతికి అండగా ఉన్న సమాజానికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నామని అన్నారు. లక్ష్యం కోసం పనిచేస్తే గుర్తింపు, గౌరవం వస్తుందనడానికి తనకు వచ్చిన పురస్కారమే నిదర్శనమని మంద కృష్ణ అన్నారు.

బాధ్యత మరింత పెంచింది..

కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, చంద్రబాబు.. వర్గీకరణ లక్ష్యానికి చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంద కృష్ణ అన్నారు. పద్మశ్రీ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, సమాజానికి రుణపడి ఉన్నామని, ఎమ్మార్పీఎస్ లక్ష్యం వర్గీకరణ అయినప్పటికీ సమాజం కోసం అనేక పోరాటాలు చేస్తున్నామని అన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకు సంబంధం లేకుండా స్వతంత్య్రం అనం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

I feel that ‘Padma Shri’

You cannot copy content of this page

Scroll to Top