KTR : బీఆర్‌ఎస్ మాటే అక్షర సత్యం.. ఎన్డీఎస్ఏ నివేదికపై కేటీఆర్

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్, మే 28: మేడిగడ్డ బ్యారేజీకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను మరోసారి తప్పుబట్టారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ నివేదిక బూటకమని బీఆర్‌ఎస్ చెబుతున్న మాట వాస్తవమని తేలిందన్నారు. మేడిగడ్డ బ్యారేజి గురించి ఎన్డీఎస్ఏను ఎల్‌ అండ్ టీ అడిగిన ప్రశ్నతో ఇది తప్పుడు నివేదిక అని తేలిందన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ చెప్పడం దివాలాకోరు విధానాలకు నిదర్శనమంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేటీఆర్ విరుచుకుపడ్డారు.

కేటీఆర్ ట్వీట్

మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందన్నారు. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైపోయిందని అన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఏఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లా

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS's word is literal truth

You cannot copy content of this page

Scroll to Top