Trinethram News : అమరావతి:మే 26 : ఎట్టకేలకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు రేంజ్ పోలీసులు బెంగళూరులో కాకాణిని అరెస్ట్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2 నెలలుగా కాకాణి పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలించాయి.
ఇప్పటికే ముందస్తు బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులలో కాకాణికి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. పోలీసులు కాకాణిని బెంగళూరు నుంచి ఏపీకి తీసుకొస్తున్నా రు.క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని కోరారు.
కానీ, కాకాణి విచారణకు రాలేదు. అంతేకాదు అజ్ఞా తంలోకి వెళ్లిపోయారు. కేసుల నుంచి రక్షణ పొందేందుకు ఆయన కోర్టులను ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం విఫలయత్నాలు చేశారు. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. కానీ, ఆ ప్రయత్నా లన్నీ విఫలమయ్యాయి.
కాకాణి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కూడా కొట్టివేయడం తో ఆయన దారులన్నీ మూసుకుపోయాయి. దాదాపు 2 నెలలుగా పరారీలో ఉన్న కాకాణిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో ఆయన బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి కాకాణిని అదుపులోకి తీసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


