తేదీ : 24/05/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ క్రికెట్ గ్రౌండ్ పరిశీలన నిమిత్తం కర్నూలు వెళ్లిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని. శివనాద్ (చిన్ని) కర్నూలు ఎంపీ బస్తాపాటి .నాగరాజుతో కలిసి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
తన నివాసానికి విచ్చేసినటువంటి శివనాథ్ కు మంత్రి భరత్ రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ స్వాగతం పలికారు. విజయవాడ ఎంపీ కు పుష్పగుచ్చం అందించగా మంత్రి టీజీ భరత్ శాలువాతో సత్కరించి జ్ఞాపకను బహుకరించడం జరిగింది. అదేవిధంగా కర్నూలు ఎంపీ నాగరాజును కూడా టీజీ భరత్ శాలువాతో సత్కరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


