జూన్ 27, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్:నవాబ్ పేట్ మండలంలో తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న జయరాంతాసిల్దార్ జన్మదినాన్ని కార్యాలయంలొ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. నవాబుపేట్ ఎమ్మార్వో నవాబుపేట్ మండల టెక్నికల్ అసిస్టెంట్లు శ్రీరాములు రవీందర్ మండల నాయకులు శివరాజ్ జాన్ మరియు జిల్లా పాత్రికేయుడు నర్సింగ్ రావు తాసిల్దార్ జయరాం కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువ కప్పి కేక్ కట్ చేయడం జరిగింది. తాసిల్దారు ఇటీవలే సంగారెడ్డి జిల్లా కు బదిలీ కావడం జరిగింది. నవపేట్ మండల టెక్నికల్ అసిస్టెంట్లు శ్రీరాములు, రవీందర్ మాట్లాడుతూ మీ సేవలు మరువలేనివి మిమ్ములను ఎప్పటికీ మర్చిపోలేక పోతున్నామని మాట్లాడడం జరిగింది.

అదేవిధంగా మండల నాయకులు శివరాజు, జాన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మీరు మా నవాబుపేట మండలం నుండి వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది, మిమ్ములను ఎప్పటికీ మర్చిపోలేక పోతున్నామని అనడం జరిగింది. జిల్లా పాత్రికేయులు నర్సింగ్ రావు మాట్లాడుతూ మండలానికి ప్రతిరోజు సమస్యలపై వచ్చే ప్రజలకు మృదుస్వభావంగా సమాధానమిస్తూ ఎల్లవేళలా కృషి చేస్తున్న జయరాం ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సిబ్బంది అధికారులు శ్రీరాములు రవీందర్ మండల నాయకులు శివరాజ్, జాన్, జిల్లా ప్రాత్రికేయులు నర్సింగ్ రావు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Birthday wishes to Tahsildar

You cannot copy content of this page