Book Launch Program : పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం

TRINETHRAM NEWS

మండపేట త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస వేదిక ఆధ్వర్యంలో ముద్రించిన గ్రంథాలయ విజ్ఞాన సర్వస్వం వ్యాస సంకలనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక శాఖా గ్రంథాలయంలో శనివారం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రంథాలయ పునర్వికాస వేదిక కన్వీనర్ మాతా చినబాబు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.తొలి ప్రతిని గ్రంథాలయ అధికారిణి ఎస్. పూర్ణమ్మకు అందజేశారు.ఈ కార్యక్రమంలో అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు గండి స్వామి ప్రసాద్, గ్రంధాలయ పాఠకులు, వేసవీ విజ్ఞాన శిబిరం లో పాల్గొన్న చిన్నారులు సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ ఈ పుస్తకంలో స్వాతంత్ర ఉద్యమ కాలంలో ప్రారంభమైన గ్రంథాలయ ఉద్యమం జాతీయ ఉద్యమానికి దోహదపడిన అంశాలు, తొలినాటి గ్రంథాలయాలు, ప్రజా జీవనంలో పౌర గ్రంథాలయాలు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమము, గ్రంథాలయ చట్టాలు, గ్రంధాలయ సమాచార శాస్త్రం, గ్రంథాలయ ఉద్యమ సారధులు, సాహిత్య పఠనం తదితర అంశాల పై విలువైన వ్యాసాలు ఉన్నాయన్నారు.
గ్రంధాలయాలు పట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి ఈ పుస్తకాన్ని ప్రచురించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని గ్రంథాలయాలకు గ్రంథాలయ విజ్ఞానం పుస్తకాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు. మండపేట శాఖ గ్రంథాలయానికి గ్రంథాలయ విజ్ఞానం పుస్తకాన్ని బహుకరించినట్లు ఆయన తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Book Launch Program

You cannot copy content of this page

Scroll to Top