MLA Venigandla : సిపార్స్ లేఖలు అందజేత

TRINETHRAM NEWS

తేదీ : 17/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ ఏలూరు రోడ్డులోని టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సంబంధిత బాధితు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి సిపార్స్ పత్రాలను ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము అందజేయడం జరిగింది. బాధితుల ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి మనో ధైర్యం చెబుతూ ఉంటానని భరోసా ఇచ్చారు.
తమ కష్టాలను చూసి తక్షణమే స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సీయం ఆర్ యఫ్ తో మెరుగైన వైద్యం అందుతుందని గుర్తు చేశారు. గడిచిన పదకొండు నెలల కాలంలో నియోజకవర్గ పరిధిలో బాధిత కుటుంబాలకు కోటిన్నర సీఎం సాయనిది చెక్కులు అందించమన్నారు. దేవుడి దీవెనలతో సంపూర్ణ ఆరోగ్యంతో అందరూ కోలుకోవాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు మరియు అనారోగ్య సమస్యలతో చికిత్సలు చేయించుకుంటున్న గుడివాడ పన్నెండు వ వార్డుకు చెందినటువంటి షేక్. సలీమా గుడ్లవల్లేరు మండలం, చిన్నకోట గ్రామానికి చెందిన కె. నాగరాజు, యం. పండు బాబు, కౌతవరం గ్రామానికి చెందిన ఆర్. నరసింహారావు, నందివాడ మండలం, పెద్ద లింగాల గ్రామానికి చెందిన గండికోట. అచ్చమ్మ కుటుంబాలు సిపార్స్ లేఖలు అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్షులు డి. రాంబాబు, డి. సన్యాసిరావు, టిడిపి నాయకులు, పి. సాంబయ్య, షేక్ .ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Handing over of CPA

You cannot copy content of this page

Scroll to Top