పేద ఆటో కార్మికులను ఆదుకోవడంలో ఆప్తుడు వాళ్ల హరీష్ రెడ్డి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పట్టణం బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు ఎండి అతరోద్దీన్ రోజువారి కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఫైనాన్స్ లో సొంత ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ గా 30వేల రూపాయలు అవసరం కాగా వ్యాల్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 30వేల రూపాయలు వారికి అందించి సొంత ఆటో కొనుక్కోవడానికి సహాయం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతాపూర్వకంగా బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని ఐబి కాలనిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అంతర్గాం మండల మాజీ జెడ్పిటిసి ఆముల నారాయణ పాల్గొని మాట్లాడుతూ వ్యాలా హరీష్ రెడ్డి నియోజకవర్గంలో పేద ప్రజలకు అనేక రకాలుగా ఆదుకుంటున్నారని అదేవిధంగా కార్యకర్తల సమస్య తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపుతున్నారని నియోజకవర్గ బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. వారు అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండి ఇలా పేదలను అదేవిధంగా కార్యకర్తలను ఆదుకోవాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి అదేవిధంగా బక్కి కిషన్ పోలాడి శ్రీనివాసరావు, రోడ్డ సంపత్, నాగుల మోహన్ రావు, అడ్డగట్ల గోపి, కొయ్యడ రమేష్, నూతి రాజ్ కుమార్, ఖాజా మొయినుద్దీన్ తహసీన్ గార్లు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


