జూన్ 26, 2026
TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం లోని స్థానిక ఎన్టిపిసి టౌన్షిప్ నందుగల శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు సీబీఎస్సీ టెన్త్ ఫలితాలలో అద్భుతమైన మార్కులు సాధించారు.
మొత్తం 500 మార్కులకు గాను యష్ సింగ్ రాణా 495 టాప్ మార్కులు సాధించగా, ఓమీషా వర్మ 487 మార్కులు, అక్షర శ్రీ యoసాని 481 మార్కులు, ఇషిత్ సోనీ 479 మార్కులు, స్పర్ష్ వర్మ 475 మార్కులు సాధించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను మరియు అధ్యాపకులను పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ అభినందించారు. ఫలితాల పట్ల వైస్ ప్రిన్సిపల్ నమ్రత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేంద్ర కుమార్, డీన్ అనిల్ కుమార్ మరియు అధ్యాపక బృందం ఆనందం వ్యక్తం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NTPC Sri Chaitanya students

You cannot copy content of this page