Rajababu : వైసిపి రాష్ట్ర రైతు, విభాగ కార్యదర్శి రాజబాబుకు నాయకుల పరామర్శ

TRINETHRAM NEWS

మండపేట త్రినేత్రం న్యూస్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. మండపేటలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రెడ్డి రాజబాబు కుమారుడు రెడ్డి సూర్య సందీప్ (26) తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ చింతా అనురాధ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సందీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, గాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

పరామర్శించిన వారిలో చైర్పర్సన్ ప్రతివాడ నూక దుర్గారాణి, పోతంశెట్టి ప్రసాద్, మెండు బాపిరాజు, సత్తి వెంకటరెడ్డి, జిన్నూరి సత్య సాయిబాబా, షేక్ఆ లీఖాన్ బాబా, అధికారి శ్రీను, పెంకే గంగాధర్, పిఠాపురం సత్యనారాయణ, జొన్నపల్లి సత్తిబాబు, కొవ్వూరి త్రినాథ్ రెడ్డి, తణుకు అశోక్, చిక్కాల శ్రీనివాస్, శెట్టి నాగేశ్వరరావు, కోళ్ళ శ్రీను, కొప్పిరెడ్డి కిట్టయ్య, సాధనాల శివ భగవాన్, గోరు అన్నవరం, వల్లూరు రామకృష్ణ, టి.పుల్లేశ్వరరావు, టి.వి.గోవిందరావు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YCP State Farmer and Division

You cannot copy content of this page

Scroll to Top