ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం ( త్రినేత్రం న్యూస్) :
హార్దిక సహాయం అందించిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు
స్థానిక కుక్కునూరు మండలం బర్లమడుగు గ్రామంలో అనుకోకుండా మంటలు చెలరేగి రేసు రాజులు, సోయం బుల్లెమ్మ అనే ఇద్దరి ఇల్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసి సమాచారం తెలియపరిచారు. వెంటనే హుటా హుటేనా ఫైర్ సిబ్బంది వచ్చి మంటను అర్పి వేయడం జరిగింది. అయినా కూడా ఉపయోగం లేకుండా సామాన్లు మొత్తం కాలిపోయి కట్టుబట్టలతో బయటకు రావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కుక్కునూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు, కుక్కునూరు ఎమ్మార్వో రమేష్ బాబు, కుక్కునూరు టిడిపి నాయకులు మరియు వింజరం పంచాయతీ టిడిపి నాయకుల సమక్షంలో అక్కడ చేరుకొని బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 20 కేజీల బియ్యం, కూరగాయలు, 2000 రూపాయలను, ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కుక్కునూరు ఉప సర్పంచ్ పిచ్చుక రాజు ,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రమణ రాజు , పులి శ్రీను, వింజరం పంచాయతీ నాయకులు నకెరకంటి భాస్కర్ రావు, రాయి ప్రసాద్, గుర్రం ఉదయ్,బొంతు వెంకటేశ్వర్లు, మాగంటి ప్రసాద్ , ఏపూరి రవి , సంపత్ , కొండపల్లి శ్రీను, కంటే రాంబాబు , ఏపూరి రామయ్య , గుర్రం సందీప్, చల్లకోటి వినోద్ , మాగంటి శేఖర్ , నకెరకంటి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


