Trinethram News : విశాఖపట్నం : ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 21వ తేదీన విశాఖలో నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విశాఖ జిల్లా అధికారులకు సమాచారం అందింది. విశాఖలో ఏటా తూర్పు నౌకాదళం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, జిల్లా యంత్రాంగం వేర్వేరుగా యోగా దినోత్సవాలు నిర్వహిస్తుంటాయి. అయితే ప్రధాని ఏ కార్యక్రమంలో పాల్గొననున్నారో స్పష్టత రావలసి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


