ఈ నెల 7 న రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన
పదినెలల్లో నగరంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేశాం
అవసరమైన చోట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం
వైసీపీ హయాంలో అనవసర పనులు… అవినీతి
దేవీచౌక్… పుష్కర ఘాట్ రాళ్ళపై విజిలెన్స్ విచారణ
వారి అవినీతితేలాక ఆ రెండుచోట్ల సీసీ రోడ్లు వేస్తాం
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
9వ వార్డు వెంకటేశ్వర నగర్ లో రూ.90 లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థాపన
Trinethram News : రాజమహేంద్రవరం : నగర ప్రజల 15 ఏళ్ళ కల నెరవేర్చేందుకు రూ. 8 కోట్లతో రివర్ ఫ్రంట్ పనులకు ఈ నెల 7వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. రివర్ ఫ్రంట్ తో గోదావరిగట్టు రూపురేఖలు మారనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 9వ వార్డు పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో రూ. 90 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమండ్రిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని అప్పర్ ప్రామినేట్ ముందుగా చేస్తున్నామని, లోయర్ ప్రామినేట్ పనులకు ఇరిగేషన్ వారి నుంచి అనుమతి రావలసి ఉందని వచ్చాక ఆ పని కూడా రూ14 కోట్లతో చేస్తారని దీంతో మొత్తం రూ. 22 కోట్లతో రివర్ ఫ్రంట్ పూర్తవుతుందని ఆయన చెప్పారు.
నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడమంటే ఇది అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. వైసీపీ హయాంలో వెంకటేశ్వర నగర్ రోడ్డుకు నిధులు మంజూరైనా అక్కడ తమ ఓటర్లు లేరనే తప్పుడు భావనతో కక్షపూరితంగా సంవత్సరాల తరబడి ఈ రోడ్డు వేయలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. ఓటర్లు ఎప్పుడూ ఒకేవైపు ఉండరని, పనులు చేసి వారిని తమవైపు ఆకర్షించుకోవాలని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోందని, కాని వైసీపీ ఐదేళ్ళ పాలనలో పరిమితంగా కొన్ని ప్రాంతాల్లోనే పనులు జరిగాయని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు అవసరమైన చోట్ల అభివృద్ధి పనులు చేపట్టకుండా అనవసరమైన చోట డివైడర్ లు, ఫుట్ పాత్ లు నిర్మించి వాటికి బిళ్ళలు, టైల్స్ అతికించి అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. దేవీచౌక్, పుష్కర ఘాట్ వద్ద వేసిన రాళ్ళు తన్నుకుని ప్రజలు పడిపోతున్నారని అసలు ఈ రెండు ప్రాంతాల్లో ఈ రాళ్ళు ఎందుకు వేశారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
విమానంలో ప్రయాణం చేసేటప్పుడు టర్బన్ లైన్ జోన్ వస్తోందని, ప్రయాణికులు సీటు బెల్టు పెట్టుకోవాలని పైలట్ అనౌన్స్ చేస్తాడని, ఆ టర్బన్ లైన్ జోన్ రాగానే విమానం ఊగిపోతుంటుందని ఆయన చెబుతూ అలాగే దేవీ చౌక్, పుష్కర ఘాట్ వచ్చేసరికి టర్బన్ జోనచ మాదిరి వాహనాలు దడదడలాడి పోతుంటాయని అన్నారు. నగర కమిషనర్ వచ్చినప్పటి నుంచి దేవీచౌక్, పుష్కర ఘాట్ వద్ద రోడ్డు వేద్దామని చెబుతున్నారని, అయితే ఈ రాళ్లు ఎందుకు వేశారనేదానిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నామని వైసీపీ వారి అవినీతి తేలాక సీసీ రోడ్లు వేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పది నెలల్లో నగరంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఆయన చెప్పారు. మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
అవసరమైన ప్రతిచోటా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుందని, గాదాలమ్మ నగర్, లోలుగు నగర్ లో 10వ వార్డులో రెండు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అవసరమైన చోట పనులు చేస్తున్నామని, వైసీపీ పాలనలో అనవసరమైన చోట కోట్లు ఖర్చు చేశారని, కంబాల పార్కులో నిధులన్ని కుమ్మరించారని, ఇప్పుడు తాము నగరంలోని 21 పార్కులను సుందరీకరణ చేసేందుకు రూ. 10 కోట్లు కేటాయించామని ఆయన చెప్పారు. 7 పార్కులను ముందు చేస్తున్నామని ఆయన చెప్పారు. అవసరమైన ప్రతి చోటా అభివృద్ధి పనులు చేస్తామని, వైసీపీ పాలనకు, కూటమి పాలనకు ప్రజలు తేడా తెలుసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. పుష్కరాలకు రూ. 2 వేల కోట్లు అంచనాలు పంపించామని రానున్న రోజుల్లో రాజమండ్రి నగరాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


