Ministries Stands by Fire Victims : అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన లవింగ్ హార్ట్స్ మినిస్ట్రీస్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం : అశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా నాలుగు ఇల్లులు పూర్తిగా కాలి పోయి బాధితులు సర్వం కోల్పోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న లవింగ్ హార్ట్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డేవిడ్ సన్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి వారి బృందంతో ఈ రోజు సంఘటన స్థలాన్నీ పరిశీలించి జరిగిన విషయాన్ని బాధితుల ద్వారా తెలుసుకొని వారి వంతు సహాయంగా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి వస్తువులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో లవింగ్ హార్ట్స్ మినిస్ట్రీస్ దైవ సేవకులు కాక రమేష్ జాషువా, గడ్డం యాకోబు,సోయం అర్జున్,సోయం బాలు, కాక శ్రీను, సోయం సునీల్, కోడిమే వంశీ మరియు ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా జాతీయ ఆదివాసీ సేవకుల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు కుర్సాం నిరీక్షణ రావు, రాష్ట్ర సెక్రటరీ కొండ్రు శ్యామ్ బాబు, నియోజకవర్గ అధ్యక్షులు కుర్సాం దైవ ప్రసాద్, స్థానిక పాస్టర్ అనన్య మరియు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Loving Hearts Ministries stands

You cannot copy content of this page

Scroll to Top