Bandh for Tribal Rights Successful : గిరిజన హక్కుల కోసం బంద్ విజయవంతం

TRINETHRAM NEWS

స్పెషల్ డిఎస్సి పై ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ శాంత కుమారి హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ (అరకులోయ) అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 3: ఏజెన్సీ ప్రాంత గిరిజనుల న్యాయహక్కుల కోసం స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ చేపట్టిన మన్యం రాష్ట్ర బంద్ కి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఈ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచి పెంట శాంతకుమారి మద్దతు తెలియజేశారు.
ఆమె మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెగా డీఎస్సీలో 766 పోస్టుల్లో గిరిజనులకు కేవలం 42 పోస్టులు మాత్రమే కేటాయించడం అత్యంత అన్యాయం. ఇది గిరిజన యువతపై తీవ్ర ఆవేదన కలిగించే నిర్ణయం,” అని పేర్కొన్నారు.
ఆమె మరోవైపు గుర్తు చేసిన విషయం ఏమిటంటే, ప్రతిపక్ష హోదాలో నారా చంద్రబాబు నాయుడు అరకు బహిరంగ సభలో గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ, ఉద్యోగాల్లో శాతం రిజర్వేషన్, ఉద్యోగ భద్రత చట్టాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్ణంగా విస్మరించారని విమర్శించారు.
మన్యం బంద్‌లో భాగంగా అరకు వేలి నాలుగురోడ్డు కూడలి నుంచి గ్రీన్ వెల్లీ జంక్షన్ వరకు గిరిజన, ప్రజాసంఘాల నాయకులు నిర్వహించిన నిరసనలు ఉధృతంగా సాగాయి. గిరిజనేతరులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటం గిరిజన సమాజంపై తీవ్ర అన్యాయం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జి.ఓ నెం. 3 ఆధారంగా గిరిజనులకు 100% ఉద్యోగ కల్పన హక్కు ఉండగా, ఆ జీవోను రద్దు చేయడం వల్ల గిరిజన యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని శాంతకుమారి తెలిపారు.
మెగా డీఎస్సీలో అల్లూరి జిల్లా పాడేరులోని 400 పోస్టుల్లో గిరిజనులకు కేవలం 24 పోస్టులు, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం ఐటిడిఎ పరిధిలోని 1035 పోస్టుల్లో 61 మాత్రమే, పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ పరిధిలో కేవలం 10 పోస్టులు మాత్రమే కేటాయించడం గిరిజనుల హక్కులను పక్కన పెట్టిన చర్యగా ఆమె వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ, “వెంటనే డీఎస్సీ ప్రకటనలో సవరణలు చేసి ఆదివాసి స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. 100 శాతం ఉపాధ్యాయ నియామక చట్టం తీసుకురావాలి. ఏజెన్సీ టీచర్ పోస్టులను మెగా డీఎస్సీ నుండి మినహాయించాలి,” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు, బీసీ సెల్ జిల్లా చైర్మన్ కన్నూరి ప్రవీణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాచిపెంట చిన్నస్వామి, పాంగి గంగాధర్, కోర్రా అప్పారావు, గొల్లూరి పద్మ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandh for tribal rights

You cannot copy content of this page

Scroll to Top