MLA Nenavat Balu Naik : పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే నా ప్రధాన లక్ష్యం

TRINETHRAM NEWS

ఎంఎల్ఏ నేనావత్ బాలు నాయక్.
దేవరకొండ మే 2 త్రినేత్రం న్యూస్. అనారోగ్యానికి గురైన వారికి LOCతో ఆసరాగా నిలుస్తున్న ఎమ్మెల్యే. ఆపదలో అన్న నేనున్నానంటూ ముఖ్యమంత్రి సహాయనిధితో నిరుపేదలకు అండగా నిలుస్తున్న
– దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.

దేవరకొండ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే అధికారపు క్యాంపు కార్యాలయం నందు దేవరకొండ నియోజక వర్గంలోని పలు మండలానికి సంబంధించిన CMRF కింద మంజూరైన 205 మంది లబ్ధిదారులకు 68లక్షల 78వేల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బాలు నాయక్ మాట్లాడుతూ…. సిఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే, ఎంపిల కార్యాలయాల వద్ద చెక్కుల కోసం పడిగాపులు కాచేవారని నేడు లబ్దిదారులకు నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు కనీసం సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌ వాటిని కూడా మంజూరు చేశామని అన్నారు.

నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. అనారోగ్య కారణాలతో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం తరఫున బాధ్యతగా నేరుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు.

పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తూ, అర్హులైన పేదలకు న్యాయం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో జరుగుతుందని అన్నారు. గత 10 సంవత్సరాల తెరాస పాలనలో తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రముగా మార్చి రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా నిరుపేదలకు అందించాల్సిన సీఎంఆర్ఎఫ్ లో కూడా అవినీతికి పాల్పడిందని అన్నారు.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి పేదవాడికి ఆదుకోవాలనే సంకల్పంతో…గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా మంజూరు చేసి, అందించిన సీఎం రేవంత్ రెడ్డి కి లబ్ధిదారుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలు మండలాల కళ్యాణ లక్ష్మీ మరియు షాది ముబారక్ చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, PACs చైర్మన్లు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పలు మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

My main goal is to

You cannot copy content of this page

Scroll to Top