Awareness Seminar : అంగన్వాడి టీచర్లకు చట్టాలపై అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ CDPO ఆఫీస్ దగ్గర మేడే సందర్భంగా అంగన్వాడి టీచర్లకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి. వెంకటేష్ , ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి వివరించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండడం మంచిదని వివరించారు.

ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్-15100 ఉంటుందని వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేసే పని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. శ్రీనివాస్ మరియు CDPO వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Awareness seminar on laws

You cannot copy content of this page

Scroll to Top