CM Chandrababu : అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ముఖ్యమంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 01/05/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆత్మకూరు మండలం, నెల్లూరు పాలెం గ్రామం యస్ టి కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్ ను అందించడం జరిగింది. టిటిసి చదివిన ఆమెకు డి యసి లో ఉద్యోగం కొరకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. ఆమెకు ఐదేళ్ల కుమార్తె చైత్రకను గురుకుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు.
మరో మహిళ అంకోజి. సుమ కుమారుడికి ఉపాధి మార్గం చూపించాలని విన్నవించగా వ్యవసాయ శాఖ నుంచి డ్రోన్ శిక్షణ అందించి ఉపాధి చూపిస్తామన్నారు. అనంతరం కాలనీవాసుల నుంచి ఆర్జీలను తీసుకొని వాటికి పరిష్కార హామీ ఇవ్వడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister distributed pensions

You cannot copy content of this page

Scroll to Top